
రాజన్న సిరిసిల్ల, వెలుగు: రైతుల నుంచి కొనుగోలు చేసిన వడ్లను వెంటనే తరలించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపెరల్ పార్క్‌లో షెడ్లను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా షెడ్లలో వడ్లు నిల్వ చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. హమాలీలకు తాగునీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. అపెరల్ పార్క్‌లో ఆరు షెడ్లు, 12 కంపార్ట్మెంట్లు సిద్ధంగా ఉంచామని సివిల్సప్లై డీఎం రజిత తెలిపారు. అనంతరం గంభీరావుపేట మండలం ముస్తాఫా నగర్, దేశాయిపేట గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు.
భూభారతిపై అవగాహన
పెండింగ్ సాదాబైనామా దరఖాస్తులు భూభారతి చట్టంతో పరిష్కారమవుతాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద గురువారం నిర్వహించిన భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త చట్టంలోని అంశాలను రైతులు, ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాధాబాయి, ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, తహసీల్దార్ మారుతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.