సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి : సందీప్ కుమార్ ఝా

సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి : సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్, వెలుగు: సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ నగర్ పీహెచ్​సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

పీహెచ్​సీలోని బ్లడ్​ టెస్ట్​ రూమ్​, మెడికల్​, ఇన్ పేషెంట్ వార్డ్, బెడ్స్, టాయిలెట్స్, వాక్సినేషన్ ను పరిశీలించారు. ఈ నెలలో ఎన్ని డెలివరీల లక్ష్యం ఉందని, ఇప్పటిదాకా ఎన్ని చేశారని తెలుసుకున్నారు.