![ఎండదెబ్బ నుంచి రక్షణకు చర్యలు : సందీప్ కుమార్ ఝా](https://static.v6velugu.com/uploads/2025/02/collector-sandeep-kumar-jha-takes-measures-to-combat-summer-heatwaves-and-promotes-deet-app-for-job-opportunities_D7ySi430M9.jpg)
- కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల,వెలుగు: వేసవి వడగాల్పుల వల్ల కలిగే నష్టాల నియంత్రణ, ఎండదెబ్బ నుంచి రక్షణకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్‌లో వేసవిలో వడగాల్పుల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడగాల్పులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.
ప్రభుత్వ హాస్పిటళ్లలోని ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు ఎలా పనిచేస్తున్నాయో చెక్ చేయాలని సూచించారు. మార్చి నుంచి జులై వరకు ఆశా కార్యకర్త నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరి దగ్గర ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలన్నారు. సమ్మర్ హీట్ వేవ్ నిర్వహణ కోసం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో రజిత, ఇన్‌చార్జి డీపీవో శేషాద్రి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రవీందర్ రెడ్డి, పాల్గొన్నారు.
డీఈఈటీ యాప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు
డీఈఈటీ(డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ) యాప్ ద్వారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఈఈటీ యాప్ పై ఆఫీసర్లతో చర్చించారు. ఈ యాప్ లో విద్యార్థుల వివరాలను నమోదు చేయాలని, దీని ద్వారా ఇందులో నైపుణ్యాలు, అర్హతను బట్టి ప్రైవేట్ రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. సమావేశంలో జీఎం ఇండస్ట్రీ హనుమంతు, అధికారులు పాల్గొన్నారు.