గద్వాల, వెలుగు: జిల్లాలోని ఆర్అండ్ఆర్ సెంటర్లలో పనులు కంప్లీట్ చేసి సౌలతులు కల్పించాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఇంజనీరింగ్ ఆఫీసర్లతో సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి, ఆర్అండ్ఆర్ కాలనీల్లో పనులపై రివ్యూ చేశారు. ఎట్టెంపాడు, గట్టు లిఫ్ట్ లో జరుగుతున్న పనులు, ప్రాజెక్టులకు సేకరించాల్సిన భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్అండ్ఆర్ సెంటర్లలో నిర్వాసితులకు అనువుగా ఉండేలా పనులు చేయాలన్నారు. భూసేకరణ స్పీడప్ చేయాలని కోరారు. ఎస్ఈ శ్రీనివాసరావు, ఈఈలు రహీమోద్దీన్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
టాబ్లెట్లు అందించాలి..
జాతీయ నులి పురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్బండజోల్ మాత్రలను పంపిణీ చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో టాబ్లెట్ల పంపిణీపై రివ్యూ నిర్వహించారు. జిల్లాలో19 ఏండ్ల లోపు వారు 1.53 లక్షల మంది ఉన్నారని, వారందరికీ టాబ్లెట్లు పంపిణీ చేయాలన్నారు. డీఎంహెచ్ వో శశికళ, సిద్ధప్ప, డీఆర్డీవో నరసింహారావు పాల్గొన్నారు.