పది రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు క్లియర్ చేయాలి : సంతోష్

పది రోజుల్లో ప్రజావాణి ఫిర్యాదులు క్లియర్ చేయాలి : సంతోష్

గద్వాల, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పది రోజుల్లో క్లియర్  చేయాలని గద్వాల కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్  మీటింగ్  హాల్లో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ధరణి సమస్యలకు సంబంధించి ఐదు, భూ సమస్యలకు సంబంధించి 45, ఆసరా పెన్షన్లకు సంబంధించి 3, ఇతర సమస్యలకు సంబంధించి 21 మొత్తం 74 దరఖాస్తులు వచ్చాయి.

వీటిని వెంటనే క్లియర్  చేయాలని ఆదేశించారు. గొర్రెల పంపిణీపై లబ్ధిదారులకు స్పష్టత ఇవ్వాలని వెటర్నరీ ఏడీని ఆదేశించారు. అనంతరం ఎంఈ ఫౌండేషన్  ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లు రిలీజ్ చేశారు. అడిషనల్ కలెక్టర్లు అపూర్వ్  చౌహాన్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

మహబూబ్ నగర్ కలెక్టరేట్: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరింలని కలెక్టర్ జి.రవినాయక్  సూచించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని, దీంతో ప్రజలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. అడిషనల్  కలెక్టర్లు శివేంద్రప్రతాప్, ఎస్.మోహన్ రావు, డీఆర్డీవో యాదయ్య, డీఆర్వో కేవీవీ రవికుమార్, జడ్పీ సీఈవో జ్యోతి పాల్గొన్నారు. అనంతరం జంతు సంరక్షణపై రూపొందించిన వాల్​పోస్టర్​ను కలెక్టర్​ రిలీజ్​ చేశారు.

నాగర్ కర్నూల్ టౌన్: ప్రజావాణి కార్యక్రమానికి గైరాజరైన వైద్య ఆరోగ్య శాఖ ఆఫీసర్లకు షోకాజ్  నోటీసులు జారీ చేయాలని కలెక్టర్  ఉదయ్ కుమార్  ఆదేశించారు. కలెక్టరేట్  ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచు పెంటల్లో సమస్యలను పరిష్కరించాలని పలు గ్రామాలకు చెందిన చెంచులు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన కలెక్టర్  తాగునీటి సమస్య వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. సీసీ రోడ్లు, ఇతర సౌలతులు కల్పిస్తామన్నారు. ధరణికి సంబంధించి 26 దరఖాస్తులు వచ్చాయని పేర్కొన్నారు. అడిషనల్​ కలెక్టర్  కె సీతారామారావు, కుమార్  దీపక్  పాల్గొన్నారు.

నారాయణపేట: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్  కోయ శ్రీహర్ష అధికారులకు సూచించారు. కలెక్టరేట్  మీటింగ్​ హాల్​లో ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. హైదరాబాద్  ప్రజావాణిలో తొమ్మిది మంది తమ భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అందజేసిన అర్జీలను పరిశీలించారు. దరఖాస్తుదారులను పిలిపించి సమస్య అడిగి తెలుసుకొని వారి సమస్య పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.