గద్వాల, వెలుగు; రైస్ మిల్లర్లకు ఖరీఫ్ సీజన్ వడ్లు కేటాయించాలంటే తప్పనిసరిగా బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ ను పౌర సరఫరాల కార్పొరేషన్ కు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో వడ్ల కొనుగోలు, కేటాయింపులపై మిల్లర్లతో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మిల్లర్లను నాలుగు రకాలుగా విభజించిందని తెలిపారు. ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లు 10 శాతం బ్యాంకు గ్యారంటీ లేదంటే 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు.
రెండో రకం మిల్లర్లు గతంలో బకాయిలతో పాటు పెనాల్టీ ఉన్న వారు 20 శాతం బ్యాంకు గ్యారంటీ లేదంటే 25 శాతం సెక్యూరిటీ డిపాజిట్ అందించాలన్నారు. మూడో రకం మిల్లర్లు 100 శాతం బకాయిలు చెల్లించాలని, 25 శాతం పెనాల్టీ పెండింగ్ ఉన్నవారు పెనాల్టీ చెల్లించాలని లేదంటే, 25 శాతం బ్యాంకు గ్యారంటీ, సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. డిఫాల్టర్లుగా ఉన్న నాలుగో రకం మిల్లర్లకువడ్లు కేటాయించమని కలెక్టర్ స్పష్టం చేశారు. రైస్ మిల్లర్ల అసోసియేషన్ అభ్యర్థన మేరకు మిల్లర్లకు అదనంగా మిల్లింగ్ చార్జీలు అందజేస్తామని తెలిపారు.
దొడ్డు రకం వడ్లకు క్వింటాలుకు రూ.30, సన్న రకానికి రూ. 40 చొప్పున అదనంగా మిల్లింగ్ చార్జీలు ఇస్తామని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, సివిల్
సప్లై డీఎం విమల, స్వామి కుమార్, రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.