గద్వాల జిల్లాలో రైతులందరికీ రుణాలివ్వాలి : కలెక్టర్  సంతోష్

గద్వాల జిల్లాలో రైతులందరికీ రుణాలివ్వాలి : కలెక్టర్  సంతోష్
  • రూ.5,241.08 కోట్ల రుణ ప్రణాళిక ఖరారు 

గద్వాల, వెలుగు: జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు ముందుకు రావాలని కలెక్టర్  సంతోష్, జడ్పీ చైర్​పర్సన్​ సరిత కోరారు. బుధవారం కలెక్టరేట్  మీటింగ్  హాల్ లో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2024–-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,251.08 కోట్ల లక్ష్యంతో రూపొందించిన వార్షిక రుణ ప్రణాళిక బుక్​ను ఆవిష్కరించారు. వ్యవసాయ రంగానికి రూ.4,191.23 కోట్లు, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు  రూ.474.47 కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.156.07 కోట్లు కేటాయించినట్లు కలెక్టర్  తెలిపారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ.. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేయాలని సూచించారు.

గత ఆర్థిక సంవత్సరంలో  ఆశించిన స్థాయిలో రుణాలు ఇవ్వలేదన్నారు. అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో పని చేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. 2016–-17 నుంచి పెండింగ్ లో ఉన్న యూసీలను వెంటనే క్లియర్  చేసి ఎస్సీ విద్యార్థులకు రుణాలు అందించాలన్నారు. డీఆర్డీవో  నర్సింగరావు, ఎల్డీఎం అయ్యపురెడ్డి, నాబార్డ్  డీడీఎం మనోహర్ రెడ్డి, ఆర్బీఐ ఎల్డీవో పృథ్వి పాల్గొన్నారు.