మున్సిపాలిటీలో వర్క్స్​ కంప్లీట్ చేయాలి

 మున్సిపాలిటీలో వర్క్స్​ కంప్లీట్ చేయాలి

గద్వాల, వెలుగు: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన డెవలప్​మెంట్  పనులను ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని కలెక్టర్  సంతోష్  ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లో మున్సిపల్  ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న అమృత్  2.0 స్కీమ్  కింద చేపట్టిన స్టోరేజ్  రిజర్వాయర్, వాటర్​ సప్లై పైప్ లైన్  పనులను పూర్తి చేయాలన్నారు. 15వ ఫైనాన్స్, సీఎం అష్యూరెన్స్  ఫండ్, జనరల్  ఫండ్  ఇతర మున్సిపల్  నిధులతో ఇప్పటికే చేపట్టిన పనులన్ని కంప్లీట్ చేయాలన్నారు. 

జనరల్  ఫండ్స్  ద్వారా మున్సిపల్  సిబ్బంది వేతనాలు, ఎలక్ట్రిసిటీ చార్జీలను వారం రోజుల్లో చెల్లించాలన్నారు. మిగులు నిధులతో సమ్మర్  వాటర్  ప్లాన్  కింద వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా పనులు చేపట్టాలన్నారు. స్వచ్ఛ భారత్  నిధులతో అవసరమైన చోట్ల పబ్లిక్  టాయిలెట్లు నిర్మించాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల ఫీల్డ్  వెరిఫికేషన్ ను ఎలాంటి తప్పిదాలు లేకుండా రెండు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అడిషనల్​ కలెక్టర్  నర్సింగ రావు, ఉమ్మడి పాలమూరు మున్సిపల్  ఈఈ విజయ భాస్కర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.