గద్వాల, వెలుగు : మహిళా శక్తి స్కీమ్ అమలు స్పీడ్ అప్ చేయాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో బ్యాంకర్స్ ఆఫీసర్లతో స్కీం పై రివ్యూ మీటింగ్ నిర్వహించారు. దీర్ఘకాలంగా ఉపయోగపడే యూనిట్లపై దృష్టి పెట్టి వాటిని గ్రౌండింగ్ చేసేలా చూడాలన్నారు. అసిస్టెంట్ ప్రోగ్రాం మేనేజర్లు కమ్యూనిటీ కోఆర్డినేటర్లు టార్గెట్ పెట్టుకొని యూనిట్లను ఏర్పాటు చేయించాలన్నారు.
జిల్లాలో మైక్రో ఎంటర్ప్రైజెస్ యూనిట్లు చాలా తక్కువగా ఉన్నాయని వాటిపై దృష్టి పెట్టాలని , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల దరఖాస్తులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఎల్డీఎం అయ్యప్ప రెడ్డి, అగ్రికల్చర్ ఏడీ సక్రియ నాయక్, ఫిషరీస్ ఏడీ షకీలా భాను పాల్గొన్నారు.