స్టూడెంట్స్ క్రీడల్లో నైపుణ్యం సాధించాలి : కలెక్టర్ సంతోష్

స్టూడెంట్స్ క్రీడల్లో నైపుణ్యం సాధించాలి : కలెక్టర్  సంతోష్

గద్వాల, వెలుగు: చదువుతో పాటు ఆటల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్  సంతోష్  సూచించారు. ఆదివారం పట్టణంలోని ఇండోర్  స్టేడియంలో షేర్  అలీ ప్రీమియర్  లీగ్  సీజన్–2 క్రికెట్ పోటీలను కలెక్టర్  ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ స్టూడెంట్స్ చదువుతో పాటు క్రీడల్లో కూడా నైపుణ్యం సాధించాలని సూచించారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాల్లో శిక్షణ తీసుకోవాలని సూచించారు. 

గద్వాల జిల్లాలోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసేందుకు షేర్  అలీ ప్రీమియర్  లీగ్  పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ నెల 9 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఆరు జట్లు పోటీ పడుతున్నాయి. అనంతరం పోటీలను ప్రారంభించి బ్యాటింగ్  చేశారు. తహసీల్దార్  మల్లికార్జున్, డీవైఎస్​వో జితేందర్, న్యాయవాది భీంసేన్ రావు పాల్గొన్నారు.