
గద్వాల, వెలుగు: సర్కార్ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం గద్వాల ప్రభుత్వ హాస్పిటల్‌ను తనిఖీ చేశారు. రేడియాలజీ ల్యాబ్, ఎమర్జెన్సీ విభాగం, ఫిజియోథెరపీ సెంటర్‌ను పరిశీలించారు. సిటీ స్కాన్ మెషీన్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. డాక్టర్లు డ్యూటీకి రెగ్యులర్ గా రావాలన్నారు. యూడీఐడీ సదరం క్యాంప్ కోసం స్థలాన్ని పరిశీలించాలని, నిర్మాణ ఖర్చులపై నివేదిక ఇవ్వాలని చెప్పారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, డీఎంహెచ్ వో సిద్ధప్ప, హాస్పిటల్ సూపరింటెండెంట్ఇందిర తదితరులున్నారు.