మాతా శిశు మరణాలపై ప్రత్యేక బృందంతో ఎంక్వైరీ : కలెక్టర్ సంతోష్

మాతా శిశు మరణాలపై ప్రత్యేక బృందంతో ఎంక్వైరీ : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: మాతా శిశు మరణాలపై ప్రత్యేక బృందంతో ఎంక్వైరీ చేయాలని   కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ధరూరు గట్టు క్యాతూర్ ప్రాంతాల్లో శిశు మరణాల సంఖ్య ఎక్కువ ఉన్నాయన్నారు.  అక్కడ శిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక బృందం ఎంక్వయిరీ చేయించాలన్నారు. 

ఈ మూడు ప్రాంతాలలో శిశు మరణాలు తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టి నివేదికను స్పష్టంగా సమర్పించాలని సూచించారు.  ఫిబ్రవరి లో నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సక్సెస్ చేయాలన్నారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో గురువారం జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు నులి పురుగుల నిర్మూలల కోసం పిల్లలందరికీ ఆల్ఫామ్ డోజ్ టాబ్లెట్లు వేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిద్ధప్ప, హాస్పిటల్ సూపర్డెంట్ వినోద్ కుమార్, జిల్లా సంక్షేమ ఆఫీసర్ సునంద తదితరులు పాల్గొన్నారు.