గద్వాల జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి  : కలెక్టర్ సంతోష్.

గద్వాల జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి  : కలెక్టర్ సంతోష్.

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో ఇంటర్ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలని  కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం  మీటింగ్ హాల్ లో   కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించారు.     ఇంటర్ ఎగ్జామ్స్ కోసం 14 ఎగ్జామ్స్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.  ఫస్టియర్ లో 4,057 మంది, ఇంటర్ సెకండియర్ లో 4,284 మంది స్టూడెంట్స్ హాజరవుతున్నట్లు  తెలిపారు.

సెంటర్ల వద్ద పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషన్​  కలెక్టర్ నర్సింగారావు, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఎస్పీ మొగులయ్య, ఇంటర్ ఆఫీసర్ హృదయ రాజు  పాల్గొన్నారు.

 నిరంతర కరెంటు సరఫరా చేయాలి

వేసవిలో నిరంతరాయంగా క్వాలిటీ కరెంటు అందించాలని  కలెక్టర్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం జూరాల జనరేటర్ ప్లాంటు, జూరాల సబ్ స్టేషన్​ ను  తనిఖీ చేశారు.  కరెంటు డిమాండ్, సరఫరా వివరాలను  తెలుసుకున్నారు.