
గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీంకు గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో రాజీవ్ యువ వికాసం స్కీం పై డీసీసీ బ్యాంకుల సమావేశం, ఇందిరమ్మ ఇండ్లు, ఎల్ఆర్ఎస్ పై సంబంధిత ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించిందన్నారు.
ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని 8 వేల దరఖాస్తులను సెక్టార్ల వారీగా పారదర్శకంగా స్క్రూటీని చేయాలన్నారు. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసి కార్పొరేషన్ వారీగా బ్యాంకుల వారీగా వర్గీకరించి సోమవారం లోగా సంబంధిత బ్యాంక్ మేనేజర్లకు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు అందజేయాలని ఆదేశించారు. బ్యాంక్ మేనేజర్లు వారంలోగా అర్హత నివేదికను అందజేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, ఈడీఎస్సీ కార్పొరేషన్ రమేశ్ బాబు, ఇన్‌చార్జి ఎల్డియం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.