
గద్వాల, వెలుగు: ఏఐ(ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్)తో విద్యలో విప్లవాత్మక మార్పులు వస్తాయని కలెక్టర్ సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండలంలోని కొండేర్ ఉన్నత పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ ఏఎక్స్ఎల్ కంప్యూటర్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఏఐ ఆధారిత బోధన పద్ధతులను పరిశీలించి, టీచర్లకు పలు సూచనలు చేశారు. ఏఐ బోధన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంచుతుందని తెలిపారు.
జిల్లాలోని 26 ప్రభుత్వ పాఠశాలల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ క్లాసులను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ నరేశ్, ఎంఈవో అమీర్ పాషా, హెచ్ఎం శ్రీనివాసులు, జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్తర్ రాణి పాల్గొన్నారు.
స్కూళ్లలో ఏఐ విద్యాబోధన ప్రారంభం
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాల్లో 13 పాఠశాలల్లో ఏఐ ద్వారా విద్యాబోధన చేపడుతున్నట్లు అడిషనల్కలెక్టర్ అమరేందర్ తెలిపారు. శనివారం తాడూర్ మండలంలోని ఐతోల్, మేడిపూర్ ప్రైమరీ స్కూళ్లలో తరగతులను శనివారం డీఈవో రమేశ్‌కుమార్ తో కలిసి, ప్రారంభించారు. విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దోహదం చేస్తుందన్నారు.
కంప్యూటర్ ల్యాబ్ లో పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ప్రతీరోజు ఈ ల్యాబ్ ను వినియోగించాలని టీచర్లకు సూచించారు. ఉపాధ్యాయుల పనితీరును ఎంఈవోలు పర్యవేక్షిస్తూ కార్యక్రమాన్ని రోజువారీగా సమీక్షించాలని ఆదేశించారు.