గద్వాల, వెలుగు: గద్వాల్ మున్సిపల్‌పరిధిలో డ్రోన్‌సర్వే చేసి కొత్త మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ఆవరణలో డీటీసీపీ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ బి.ఎస్ కేశవులు, మున్సిపల్ అధికారులు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులతో పూజ చేసి ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధిలో భాగంగా, మున్సిపాలిటీ సమస్యలు లేకుండా మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్నామని అన్నారు. భవిష్యత్‌తరాలకు డిజిటల్‌రూపంలో అందుబాటులో ఉంచడమే లక్ష్యమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకంలో భాగంగా జీఐఎస్ ఆధారిత ప్రణాళిక కోసం ఎంపికైన తెలంగాణలోని 20 మునిసిపాలిటీలలో ఒకటైన గద్వాల మున్సిపల్ డిజిటల్ మాస్టర్‌సర్వే చేయడం కోసం సెలెక్ట్‌చేశామన్నారు. గద్వాల మున్సిపాలిటీకి సంబంధించిన మాస్టర్ ప్లాన్ డిజిటల్‌సర్వేను లేటెస్ట్ టెక్నాలజీ, డ్రోన్‌కెమెరాల సహాయంతో పూర్తిగా వివరాలతో తయారుచేస్తున్నామని అన్నారు.ప్రతిదీ ఫొటోలతో విభాగాల వారీగా సేకరించి బేస్‌మ్యాప్‌లను తయారు చేస్తారన్నారు.
డ్రోన్ సర్వేల ద్వారా సేకరించిన ఖచ్చితమైన మ్యాపింగ్ తో భవనాలు, రహదారులు, నీటి వనరులు, పార్కులు, మురుగు వ్యవస్థలు వంటి మౌలిక వసతుల స్థితిని పరిశీలించి, వాటి నిర్వహణ ,అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించవచ్చ న్నారు.ఈ కార్యక్రమంలో డీటీసీపీ అడిషనల్ డైరెక్టర్ రమేశ్ బాబు, మున్సిపల్ కమిషనర్‌దశరథ్, టౌన్ ప్లానింగ్ అదికారి కుర్మన్న, సర్వే ఆఫ్‌ఇండియా అధికారులు, డీటీపీసీ అధికారులు, మున్సిపల్‌అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉప్పెర్ డాక్టర్ షోకాజ్ నోటీసు
ధరూర్ మండల పరిధిలోని ఉప్పెరు పీహెచ్సీ డాక్టర్ కు షోకాజు నోటీసు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల పీహెచ్ సిలో మాతృ మరణాలపై సీరియస్ అయ్యారు. హై రిస్క్ కేసులలో నిర్లక్ష్యం వహించొద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి డీఎం అండ్ హెచ్ ఓ సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.