గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : కలెక్టర్ సంతోష్

గద్వాల జిల్లా అభివృద్ధికి కృషి చేస్తా : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని కలెక్టర్  సంతోష్  తెలిపారు. బదిలీపై వచ్చిన కొత్త కలెక్టర్  సంతోష్ గురువారం చార్జి తీసుకున్నారు. అడిషనల్  కలెక్టర్లు అపూర్వ్  చౌహాన్, శ్రీనివాసులు బొకే అందజేసి స్వాగతం పలికారు. జిల్లా అధికారులు, కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా అధికారులు కృషి చేయాలన్నారు. విద్య, వైద్యరంగాల్లో జిల్లాను ముందుకు తీసుకెళ్లేందుకు మొదటి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గతంలో వనపర్తి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శిక్షణ పొందిన తనకు జిల్లాపై అవగాహన ఉందన్నారు. ఆర్డీవో చంద్రకళ, ఏవో భద్రప్ప పాల్గొన్నారు.