కందనూలు, వెలుగు : నాలుగు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ బదావంత్ సంతోష్ సూచించారు. గురువారం బిజినేపల్లి ఎంపీడీవో ఆఫీస్లో ఆఫీసర్లతో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలంలోని అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి పథకాలు అందేలా చూడాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల లిస్ట్ తయారీలో మండల స్థాయి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
రేషన్ కార్డుల్లో పేర్ల తొలగింపు, చేర్పులు, కొత్త కార్డుల కోసం అర్హులైన వారి జాబితా రెడీ చేయాలన్నారు. మండల ప్రత్యేకాధికారి రాజేశ్వరి, తహసీల్దార్ శ్రీరాములు, ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతి ఉన్నారు. అనంతరం మండలంలోని పాలెం గ్రామపంచాయతీలోని సర్వే నంబర్ 275/ఆ లో గ్రామపంచాయతీ లేఔట్ ను కలెక్టర్ పరిశీలించారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికపై క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను గుర్తించి, వివరాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.