![స్కీమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి : కలెక్టర్ సంతోష్](https://static.v6velugu.com/uploads/2025/02/collector-santosh-suggested-raising-awareness-on-the-schemes-being-implemented-by-the-central-and-state-governments-during-the-field-visit_Wh4ewuUkBa.jpg)
గద్వాల, వెలుగు : ఫీల్డ్ విజిట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న స్కీమ్స్‌పై అవేర్నెస్ పెంచుకోవాలని కలెక్టర్ సంతోష్ సూచించారు. సోమవారం ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ 139వ స్థాయి శిక్షణలో భాగంగా జిల్లాకు వచ్చిన 16 మంది కేంద్ర సచివాలయ సేవల సెక్షన్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు. జిల్లా భౌగోళిక పరిస్థితి, మండలాలు, జనాభా తదితర అంశాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాల గురించి తెలిపారు.
16 మంది ట్రైనీ ఆఫీసర్లు నాలుగు బృందాలుగా విడిపోయి ఈ నెల18 వరకు షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పని చేయాలన్నారు. టీమ్స్ వారీగా జిల్లా ఆఫీసర్లు వారికి సమన్వయం చేసుకుంటూ గైడ్ చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు, రమేశ్‌బాబు పాల్గొన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న గద్వాల పట్టణానికి చెందిన లక్ష్మికి రూ.2.50 లక్షల ప్రోత్సాహక చెక్కును అందించారు.