
సంగారెడ్డి టౌన్, వెలుగు: అధికారులు ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు నడుచు కోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని కలెక్టర్ శరత్ సూచించారు. గురువారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తో కలిసి ఇంజనీరింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఎన్నికల కమిషన్ నిబంధనలను విధిగా పాటించాలన్నారు.
ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన వివిధ పనుల్లో గ్రౌండింగ్ అయి పనులు జరుగుతున్నట్లైతే, ఆ పనులు చేయవచ్చని, కొత్త పనులను గ్రౌండింగ్ చేయకూడదని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించరాదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్‌ఓ నగేశ్, ఆర్డీవో రవీందర్ రెడ్డి, ఇంజనీరింగ్ శాఖల ఎస్‌ఈలు, ఈ ఈ లు, డీఈలు, ఏఈలు, పాల్గొన్నారు.
నగదు ట్రాన్జాక్షన్పై నిఘా పెట్టాలి
అనుమానాస్పద బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించాలని కలెక్టర్ శరత్ బ్యాంకర్లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు రూ.లక్ష డిపాజిట్ చేసినా, విత్ డ్రా చేసినా, అదే విధంగా రూ.10 లక్షలు పైబడి నగదు ట్రాన్స్ఫర్ అయినా వివరాలు నమోదుచేయాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే వెంటనే చెక్ బుక్ జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మాధురి, ఎల్‌డీఎం గోపాల్ రెడ్డి, డీసీఓ, డీఆర్‌ఓ, నగేశ్, వివిధ బ్యాంకుల కంట్రోలర్స్ పాల్గొన్నారు