- బ్యాంకర్లకు సూచించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక
రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: బ్యాంకర్లు పంటల ఆర్థిక స్థాయి (స్కేల్ ఆఫ్ ఫైనాన్స్) నిర్ణయంలో ఉదారంగా వ్యవహరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. వివిధ పంటలకు ఆర్థిక స్థాయి నిర్ణయంపై సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ శశాంక అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఎక్కువగా ఇస్తే రైతులకు మేలు జరుగుతుందన్నారు.
బ్యాంకులు ఇచ్చే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మొత్తాన్ని పెంచినట్లయితే ఎకరాకు వచ్చే రుణ సాయం సైతం పెరుగుతుందన్నారు. సమావేశంలో డీసీసీబీ సీఈవో భాస్కర సుబ్రమణ్యం, రంగారెడ్డి జిల్లా పశు సంవర్థక, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.