ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యమివ్వాలి : కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చే దరఖాస్తులకు అధిక ప్రాధాన్యమిచ్చి పరిష్కరించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 30 ఫిర్యాదులు స్వీకరించినట్లు చెప్పారు. జగిత్యాలకు చెందిన కడార్ల రాజమ్మ అనే వృద్ధురాలు సర్వేనెంబర్ 1751లో ఉన్న 29 గుంటలను కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన భూమిని కాపాడాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కోరింది. 

గ్రీవెన్స్‌‌‌‌‌‌‌‌కు 121 దరఖాస్తులు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సిరిసిల్ల కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 121 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సందీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఝా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో డీపీవో శేషాద్రి, వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.