ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలి : కలెక్టర్ సత్యప్రసాద్

మల్లాపూర్, వెలుగు:- ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో అర్హులను గుర్తించాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో మంగళవారం ఆయన ఇందిరమ్మ ఇంటింటి సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. గ్రామంలోని పలు వార్డులు తిరుగుతూ సర్వే యాప్ లో ఉన్న అర్జీదారుల నుంచి వివరాలు నమోదును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గల ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. 

ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలి 

మెట్ పల్లి, వెలుగు: ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెట్‌‌‌‌‌‌‌‌పల్లి మండలం ఆత్మకూర్, మల్లాపూర్ మండలం సాతారం వాగుల్లో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌‌‌‌‌‌‌‌లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్కారు ఇసుక పాలసీకి అనుగుణంగానే రవాణా జరగాలని ఆదేశించారు.

ఇసుక అక్రమ రవాణా జరగకుండా చెక్ పోస్ట్  ఏర్పాటు చేయాలని మైనింగ్ అధికారులకు సూచించారు. ఆయా కార్యక్రమాల్లో ఆర్డీవో శ్రీనివాస్, జిల్లా మైనింగ్ అధికారి జైసింగ్, తహసీల్దార్లు వీర్ సింగ్, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌, ఎంపీడీవోలు శశికుమార్, మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి  పాల్గొన్నారు.