జగిత్యాల టౌన్, వెలుగు: డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల పనుల్లో వేగం పెంచి డిసెంబర్‌లోగా పూర్తిచేయాలని జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నూకపల్లి లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతతో పనులు చేయాలన్నారు. ఎక్కువ మంది లేబర్‌ను తీసుకొని గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం బీర్పూర్ మండలకేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌ను ఆర్డీవో శ్రీనివాస్ తో కలిసి తనిఖీ చేశారు. అంతకుముందు రోళ్లవాగు ప్రాజెక్టు పనులను పరిశీలించారు.