వరంగల్, వెలుగు: వరంగల్ జిల్లాలో 25 లక్షల 58 వేల 317 మొక్కలు నాటేందుకు శాఖల వారీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారదాదేవి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అటవీశాఖ అధికారి అనుజ్ అగర్వాల్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి వనమహోత్సవంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అటవీ శాఖ 50 వేలు, గ్రామీణాభివృద్ధి సంస్థ 6 లక్షల 14 వేలు, పంచాయతీరాజ్ 7 లక్షలు, నీటిపారుదల శాఖ 13,967, వ్యవసాయ, ఉద్యానవన, పట్టుపరిశ్రమల శాఖ ద్వారా లక్షా 62 వేలు, ఎక్సైజ్ 95 వేలు, మున్సిపాలిటీలు 6 లక్షల98 వేలు, విద్యా శాఖ 50 వేలు, పశుసంవర్థక శాఖ 38,400, పరిశ్రమల శాఖ 6 వేలు, గనుల శాఖ 8,400 మొక్కలు నాటేందుకు స్థలాల ఎంపిక, నిర్వహణ చూసుకోవాలని ఆదేశించారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రత్యేక అధికారులను ఆహ్వానించాలన్నారు.