రాయికల్/జగిత్యాల టౌన్, వెలుగు: జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయికల్ మండలంలోని ప్రభుత్వ భూముల సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల గుర్తింపులో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు.
అంతకుముందు జగిత్యాలలో ఎల్‌ఆర్‌ఎస్ సర్వే నిర్వహిస్తున్న ఫ్లాట్లను పరిశీలించారు. శిఖం భూములు, రెవెన్యూ సమస్యలను లేని భూములను రెగ్యులర్ చేయాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, రాయికల్ తహసీల్దార్ మహ్మద్ అబ్దుల్ ఖయ్యుం, ఎంపీడీవో చిరంజీవి, మున్సిపల్ కమిషనర్లు జగదీశ్వర్ గౌడ్, చిరంజీవి పాల్గొన్నారు.