బొల్లికొండ ప్రైమరీ స్కూల్​లో  ఒక స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌.. ఇద్దరు టీచర్లు

  • ఆకస్మిక తనిఖీలో కలెక్టర్​ ఆశ్చర్యం 

నెక్కొండ, వెలుగు : అది వరంగల్‌‌‌‌‌‌‌‌ జిల్లా నెక్కొండ మండలంలోని బొల్లికొండ ప్రైమరీ స్కూల్. ఇక్కడ ఐదు తరగతులు ఉండగా ఆరుగురు విద్యార్థులు మాత్రమే చదువుకుంటున్నారు. వీరికి ఇద్దరు టీచర్లున్నారు. ఈ మధ్య సీఎం రేవంత్​రెడ్డి కలెక్టర్లను ఫీల్డ్​ విజిట్​ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కలెక్టర్ సత్యశారద నెక్కొండలోని టీజీఎస్​ఆర్​జేసీ, అంగన్​వాడీ సెంటర్లు, ఎంపీడీవో ఆఫీసు, అప్పల్​రావుపేట జడ్పీఎస్ఎస్, బొల్లికొండలోని పీఎస్​ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బొల్లికొండ స్కూల్​లో ఇద్దరు టీచర్లకు ఒక్కరే స్కూడెంట్ ​ఉండడంతో ఆశ్చర్యపోయారు.

 రిజిస్టర్​లో మాత్రం ఆరుగురు స్టూడెంట్లు ఉండడం, ఒక్కరు మాత్రమే రావడంతో మిగతా ఐదుగురు ఎక్కడా అని ప్రశ్నించారు. వారు రాలేదని చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు. ఐదు తరగతులకు ఆరుగురు స్టూడెంట్స్ ఉండటం ఏంటని ప్రశ్నించారు. ప్రతిరోజు ఫీల్డ్​విజిట్ చేసి స్టూడెంట్స్ సంఖ్యను పెంచాలన్నారు. నెక్కొండ పీహెచ్​సీ సెంటర్​లో స్టాఫ్​ లేకపోవడంతో డాక్టర్​కు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్లు చెప్పారు. వెంట తహసీల్దార్ రాజ్​కుమార్, ఆర్ఐ నరేందర్ ఉన్నారు.