సూర్యాపేట జిల్లాలో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్..అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన ఎనిమిది మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. శుక్రవారం (జూలై12) జిల్లాలో పెన్ పహాడ్, గరిడేపల్లి మండల్లాల్లోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో జిల్లా విద్యాశాఖ అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కలెక్టర్ ఆదేశాలతో మునగాల , చిలుకూరు, కోదాడ, మట్టపల్లి, జాజిరెడ్డిగూడుం మండల్లాలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా విద్యాశాఖ అధికార అశోక్. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు అయిన ఐదుగురు ప్రధానోపాధ్యాయులు, ఇద్దరు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాలేదని జిల్లా కలెక్టర్ కు రిపోర్టు అందించారు.
Also Read:ఫ్యాక్టరీలో కెమికల్ లీకేజీ : 11 మంది కార్మికులకు అస్వస్థత
మునగాల మండలం ఆకుపాముల ప్రభుత్వ పాఠశాలలలో ప్రధానోపాధ్యాయుడు ఎస్ కే దస్తగిరి, చిలుకూరు మండలం ఆచర్లగూడెం ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎం కె. రామ్ రెడ్డి, కోదాడ మండలం, కొమరబండ ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎం పి. గోవిందయ్య, మట్టపల్లి మండలం అలిపురం ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎంఎం శేషిరెడ్డి, మద్దిరాల మండలం కుకుడం జెడ్పీహెచ్ ఎస్ ప్రధానోపాధ్యాయుడు కె.కృష్ణారెడ్డి, పెన్ పహాడ్ మండలం సింగిరెడ్డి పాలెం ఎంపీపీఎస్ ఉపాధ్యాయుడు బి. నరేందర్, ఎస్జీటీ శ్రీనవాస్, జాజిరెడ్డిగూడెం మండలం ఉయ్యాల వాడ ఎంపీపీఎస్ టీచర్ అపరాజితా రెడ్డి లకు జిల్లా కలెక్టర్ షోకాజ్ నోటీసులు ఇచ్చారు.