నామినేషన్ల స్వీకరణకు సిద్ధంగా ఉండాలె : కలెక్టర్ శరత్

కొండాపూర్,వెలుగు : నామినేషన్ల స్వీకరణకు సిద్దంగా ఉండాలనిజిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శరత్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్​లో రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు, డీఎస్పీలు, ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, టీం లకు  వీడియో కాన్ఫరెన్స్  ద్వారా దిశా నిర్దేశం చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని ఆర్ ఓ లకు సూచించారు. ఒక అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్, ప్రతిపాదించే వ్యక్తి అదే నియోజకవ ర్గానికి చెందిన వారై ఉండాలన్నారు.

జాతీయ లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ తరపున పోటీ చేసేవారు నామినేషన్ వేస్తే వారిని ఒకరు ప్రతిపాదిస్తే సరి పోతుందన్నారు. రిజిస్టర్డ్  గుర్తింపు లేని పార్టీ, స్వతంత్ర అభ్యర్థి అయితే పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుందన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషినల్​ కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, డిఆర్ఓ నగేశ్​, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, డీఎస్పీలు, పాల్గొన్నారు.

ALSO READ : రూ. వెయ్యి కోట్లతో నర్సంపేట అభివృద్ధి : పెద్ది సుదర్శన్‌‌‌‌‌‌‌‌రెడ్డి