మహబూబాబాద్, వెలుగు : సేంద్రియ వ్యవసాయం దిశగా రైతులు ముందుకు సాగాలని మహబూబాబాద్ కలెక్టర్ శశాంక సూచించారు. మహబూబాబాద్‌లో శనివారం నిర్వహించిన రైతు దినోత్సవంలో ఆయన మాట్లాడారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, భూసారాన్ని పరిరక్షించే సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపి అధిక దిగుబడులు సాధించాలని సూచించారు. అనంతరం ఉత్తమ రైతులను సన్మానించారు.
కార్యక్రమంలో ఆదర్శ రైతు జైపాల్‌రెడ్డి, డాక్టర్ దేవిరెడ్డి, నరేంద్ర స్వరూప్, పద్మనాభరావు, కృష్ణారెడ్డి, జయశ్రీ, హరీశ్, మోహన్, కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ మాలతి పాల్గొన్నారు. అనంతరం మహబూబాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన జాతీయ యువజనోత్సవాలకు కలెక్టర్ హాజరయ్యారు.
తొర్రూరులో...
తొర్రూరు, వెలుగు : రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మాటేడులో శనివారం రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సంస్థ చైర్మన్ మంగళపల్లి కృష్ణమూర్తి, కుంభం వెంకట్‌రెడ్డి, దీకొండ వెంకన్న, వీరన్న, వెంకట సోములు, నరేశ్, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.