మహబూబాబాద్, వెలుగు : మహబూబాబాద్ కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌ను గురువారం కలెక్టర్ శశాంక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల నాయకులు పాంప్లెంట్స్ పంచడం, వాల్‌పోస్టర్స్ అతికించడం, యాడ్స్ వేసుకోవడం, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు చేసుకునేందుకు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని సూచించారు.
పర్మిషన్ లేకుండా యాడ్స్ ఇస్తే కోడ్ ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయనున్నట్లు హెచ్చరించారు. 1950 నంబర్‌కు ఫోన్ చేయడంతో పాటు, సీ -విజిల్ యాప్ ద్వారా కంప్లైంట్స్ చేయవచ్చని చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ డేవిడ్, వెటర్నరీ ఆఫీసర్ సుధాకర్, గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ సురేశ్ పాల్గొన్నారు.
ALSO READ: టాలీవుడ్లో మరి క్రేజీ కాంబో.. వెంకటేష్తో బలగం దర్శకుడు