ప్రతి వెహికల్‌‌ను చెక్‌‌ చేయాలి : కలెక్టర్‌‌ శశాంక

గూడూరు, వెలుగు : చెక్‌‌పోస్టుల వద్దకు వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని మహబూబాబాద్‌‌ కలెక్టర్‌‌ శశాంక ఆదేశించారు. మహబూబాబాద్‌‌ జిల్లా గూడూరు మండలం భూపతిపేట వద్ద గల చెక్‌‌పోస్ట్‌‌ను సోమవారం ఆయన పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాల రాకపోకలను గమనిస్తూ గంటకు ఎన్ని వాహనాలు వెళ్తున్నాయో పరిశీలించి రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.

వాహనాల తనిఖీ టైంలో తప్పనిసరిగా వీడియో తీయాలని, రిపోర్టును ఏ రోజుకు ఆరోజు ఆర్‌‌వోకు పంపించాలని సూచించారు. దసరా  సెలవుల దృష్ట్యా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తనిఖీ చేపట్టాలన్నారు. డీఎస్పీ సత్యనారాయణ, ఆర్డీవో అలివేలు, నోడల్‌‌ ఆఫీసర్‌‌ నర్మద, తహసీల్దార్‌‌ అశోక్‌‌కుమార్‌‌, ఎంపీడీవో రోజారాణి, ఎస్సై రాణా ప్రతాప్‌‌ ఉన్నారు.