మహబూబాబాద్ , వెలుగు: బాలలు ఆరోగ్యంగా ఉంటేనే ఉన్నత లక్ష్యాలను సాధించొచ్చని కలెక్టర్ శశాంక అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో బాల సదనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో బాలికల బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాలల కోసం చిల్డ్రన్ హోం అవసరం ఉందన్నారు.
బాలికల బాలసదనం లో డ్రాయింగ్, డాన్స్,ఆర్ట్ వంటి కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని వరలక్ష్మి , డీఈవోరామారావు , డీఎంఅండ్ హెచ్వోఅంబరీష , చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ డా .నాగవాణి పాల్గొన్నారు.