
మహబూబాబాద్, వెలుగు : ఈ నెల 30న మంత్రి కేటీఆర్ మహబూబాబాద్‌లో పర్యటించనున్నందున పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కేటీఆర్ టూర్‌కు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలో రూ. 50 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
రూ 4.60 కోట్లతో నిర్మించిన వెజ్, నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవంతో పాటు, రామచంద్రాపురం కాలనీలో నిర్మించిన డబుల్ ఇండ్లను ప్రారంభోత్సవానికి రెడీ చేయాలని ఆదేశించారు. అనంతరం ఎన్‌టీఆర్ స్టేడియ్‌లో సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమంలో ఏఎస్పీ చెన్నయ్య, జడ్పీ సీఈవో రమాదేవి, డీఆర్డీవో సన్యాసయ్య, ఆర్డీవో కొమురయ్య, నోడల్ ఆఫీసర్లు సూర్యనారాయణ, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఎర్రయ్య, సీఐలు సతీశ్, ఫణీదర్, మున్సిపల్ కమిషనర్ ప్రసన్నరాణి పాల్గొన్నారు.