ప్రభుత్వ స్కూల్స్​లో క్వాలిటీ ఎడ్యూకేషన్​ అందించాలి : శశాంక

మహబూబాబాద్, వెలుగు :  ప్రభుత్వ స్కూల్స్​లో టీచర్లు క్వాలిటీ ఎడ్యూకేషన్​ అందించాలని కలెక్టర్​ శశాంక సూచించారు. మంగళవారం డోర్నకల్ మున్సిపాలిటీలోని జడ్పీ హైస్కూల్​లో దాత మాణిక్యమ్మ సహకారంతో రూ.3 లక్షల తో నిర్మించిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడారు. చిన్నతనం నుంచే స్టూడెంట్లు లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికా  బద్ధంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో రామారావు, ఎడ్యూకేషన్​ ఆఫీసర్లు శ్రీరాములు , సుధాకర్, డోర్నకల్ తహసీల్దార్ నాగ భవాని, మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ పాల్గొన్నారు.