
జనగామ అర్బన్, వెలుగు: వానకాలం 2023-24 సీఎంఆర్ లక్ష్యాలను పూర్తిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. గురువారం జిల్లాలోని ఓబుల్కేశ్వాపూర్ మహాలక్ష్మి ఆగ్రో ఇండస్ట్రీస్, ధాన్యమిత్ర రా రైస్ మిల్లులను ఆయన సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానకాలానికి సంబంధించి దిగుమతి అయిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లర్లకు కేటాయించిన రోజువారీ లక్ష్యాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం నిల్వకు గోదాముల్లో సరిపడా స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని, గన్నీ బ్యాగులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీఎస్వో రోజారాణి, డీఎం సీఎస్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.