జనగామ అర్బన్, వెలుగు : వానాకాలం 2024-25 సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఎటువంటి పొరపాట్లకు చోటులేకుండా సక్రమంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు పింకేశ్ కుమార్, రోహిత్ సింగ్ తో కలిసి వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలుపై ఏఈవోలు, డీపీఎంలు, ఏపీఎంలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 180 దొడ్డు రకం, 116 సన్న రకం వరి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. గన్ని బ్యాగులు, టార్పాలిన్లు, డయల్ గ్రెయిన్ క్యాలిబర్లు, చెక్ పోస్టులు, టోకెన్ల జారీ వేయింగ్ మిషన్లు, ప్యాడీ క్లీనర్లు తదితరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో డీఆర్డీవో వసంత, డీసీఎస్వో సరస్వతి, డీఏవో రామారావు నాయక్, డీఎంసీఎస్ హాతీరాం, సంబంధిత అధికారులు, సీసీలు తదితరులు పాల్గొన్నారు. జనగామ కలెక్టరేట్లో నుంచి వివిధ శాఖల అధికారులకు ఎల్ఆర్ఎస్ పైకలెక్టర్రిజ్వాన్బాషా అడిషన్కలెక్టర్పింకేశ్కుమార్తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ద్వారా రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కుడా పరిధిలోని చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, జాఫర్ఘడ్ మండలాల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు 7433 వచ్చాయని, ఇందులో మిగిలిన 6800 పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.