మక్తల్, వెలుగు: మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. పట్టణంలో మహిళా సంఘం సభ్యులు ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్‌ను సోమవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా మక్తల్ నియోజకవర్గంలో రెండు క్యాంటీన్లను ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. మరిన్ని క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఊట్కూరు, నర్వ మండలాల్లో త్వరలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీఆర్డీవో మొగులప్ప, అడిషనల్ డీఆర్డీవో అంజయ్య, తహసీల్దార్ సతీశ్ కుమార్, ఎంపీడీవో రమేశ్, లక్ష్మారెడ్డి, గణేశ్‌కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.