ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించాలి : సిక్తా పట్నాయక్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించాలి : సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు:  ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండి  మెరుగైన సేవలందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. గురువారం దామరగిద్ధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను కలెక్టర్ పరిశీలించారు. మందుల నిల్వ రిజిస్టర్, వైద్య సిబ్బంది హాజరు రిజిస్టర్ ను తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది సకాలంలో హాజరై రోగులకు సేవలు అందించాలని ఆదేశించారు.  

అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ఫ్ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత అధికారులు, ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు లింకేజీ లో వంద శాతం టార్గెట్ ను  నాలుగు రోజుల్లో పూర్తి చేయాలన్నారు. మిగతా మండలాల్లో   వంద శాతం టార్గెట్ పూర్తయినా  దామరగిద్ద మండలంలో ఇంకా  94  శాతమే ఉండటంతో కలెక్టర్ ఏపీఎంపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.