మరికల్​లో ‘గురుకుల నిద్ర’ :కలెక్టర్​ సిక్తా పట్నాయక్

మరికల్​లో ‘గురుకుల నిద్ర’ :కలెక్టర్​ సిక్తా పట్నాయక్

మరికల్, వెలుగు: శ్రద్ధతో చదువుకుని ఉన్నత శిఖిరాలను అధిరోహించాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ సూచించారు. బుధవారం రాత్రి మరికల్​ గురుకుల కాలేజీలో గురుకుల నిద్ర చేశారు. క్లాస్​ రూమ్​లకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కాంపౌండ్​ వాల్​ ఎత్తు తక్కువగా ఉండడంతో పాములు వస్తున్నాయని, కిటికీలు ఊడిపోతున్నాయని వాటిని బాగు చేయించాలని కోరారు. విద్యార్థులకు అర్థమయ్యేలా చదువు చెప్పాలని సూచించారు. భోజనం గది, రికార్డులను పరిశీలించారు. 

వంట ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలి

నారాయణపేట: మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టని ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదేశించారు. పట్టణంలోని గ్రౌండ్​ స్కూల్​ను కలెక్టర్  విజిట్​ చేశారు. మెనూ ప్రకారం కర్రీ ఎందుకు వండ లేదని నిర్వాహకులను నిలదీశారు. 20 ఏండ్లుగా ఏజెన్సీ నడుపుతున్న నిర్వాహకులు.. 6 నెలల బిల్లులు రాకపోతే మెనూ ప్రకారం భోజనం పెట్టరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ పాటించని ఏజెన్సీ నిర్వాహకులకు మోమో జారీ చేయాలని డీఈవో గోవిందరాజులును ఆదేశించారు.