కోస్గి పట్టణంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ సిక్తాపట్నాయక్

కోస్గి పట్టణంలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి : కలెక్టర్ సిక్తాపట్నాయక్

కోస్గి, వెలుగు: ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులు, సిబ్బందిని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. గురువారం కోస్గి పట్టణ కడంపల్లి శివారులో ఎస్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లెవల్-1 స్థాయిలో నీటిపారుదలశాఖ, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయికి వెళ్లి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలని, ప్రభుత్వ నిబంధనలు తప్పక పాటించాల్సిందేనన్నారు.

బఫర్ జోన్ పరిధిలో ఉంటే ఆ జోన్​ను 30 మీటర్ల దూరంలో ఉన్న ప్లాట్లను రెగ్యెలరైజ్ చేయాలని, బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్లాట్లను మాత్రం తిరస్కరించాలని సూచించారు. లెవల్-2 స్థాయిలో ఎంపీవోలు, ఎంపీడీవోలు అన్ని నిబంధనలు అనుసరిస్తూ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్నారు. కోస్గి మండలంలోని 57 పెండింగ్​దరఖాస్తుల పరిష్కారంపై కలెక్టర్ అధికారులకు తగు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ బి.శ్రీనివాసులు, ఎంపీడీవో శ్రీధర్, ఆర్ఐ సుభాష్​రెడ్డి, ఇరిగేషన్ అధికారులు తదితరులున్నారు.