- ఆఫీసర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశాలు
హనుమకొండ, వెలుగు : నయీంనగర్ బ్రిడ్జితో పాటు నాలా డెవలప్ మెంట్ వర్క్స్ జూన్ 15లోగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వానకాలం ప్రారంభం నాటికి పనులన్నీ పూర్తి కావాలని, ఈ మేరకు ఆయా పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మంగళవారం కలెక్టరేట్ లో గ్రేటర్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాఖడేతో కలిసి రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్, సాగునీటి పారుదల
ఇంజినీరింగ్ అధికారులతో కలెక్టర్ రివ్యూ చేశారు. కొనసాగుతున్న నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు నయీంనగర్ నాలా డెవలప్ మెంట్ వర్క్స్, బ్రిడ్జి పనుల గురించి కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో హనుమకొండ ఆర్డీవో వెంకటేశ్, తహసీల్దార్ విజయ్ కుమార్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వర్లు, ఈఈ ఆంజనేయులు, డీఈ హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.