
నారాయణపేట, వెలుగు: అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈలకు వెంటనే అధిక మొత్తంలో రుణాలు మంజూరు చేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో డీసీసీ సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి, సకాలంలో రుణాలు మంజూరు చేయాలన్నారు. అనంతరం నాబార్డు పొటెన్షియల్ లింక్డ్ ప్లాన్ 2025–-26 కి 3,833.47 కోట్ల రుణ లక్ష్యంతో రూపొందించిన పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఆవిష్కరింపజేశారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గ్యంగ్వార్, ట్రైని కలెక్టర్ గరిమా నరుల , ఎస్ఎల్బిసీ ఏజీఎం శ్రీహరి, ప్రకాశ్, ఆర్బీఐ ఏజీఎం శ్రావ్య తదితరులు పాల్గొన్నారు.
వరి పంటను పరిశీలించిన కలెక్టర్
ధన్వాడ: మంది పల్లి గ్రామానికి చెందిన రైతు నర్సింహులు వరి పంటను మంగళవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. నాలుగు ఎకరాల్లో వరి వేయగా ఎకరా వరకు సాగు నీరు లేక ఎండిపోయే దశకు చేరుకుందని రైతు తెలిపాడు దీంతో జిల్లాలో ఇలాంటి పరిస్థితి ఎక్కడెక్కడ ఉందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వ్యవసాయ అధికారిని ఆదేశించారు.