స్ట్రాంగ్ రూమ్ ల భద్రతను పరిశీలించిన కలెక్టర్

కాశీబుగ్గ, వెలుగు : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​లోని స్ర్టాంగ్ రూమ్​ల వద్ద భద్రతా ఏర్పాట్లను బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు స్ర్టాంగ్​ రూమ్​ల వద్ద లాగ్ బుక్​, సీసీ కెమెరాల పర్యవేక్షణకు సంబంధించిన వాచ్​రూమ్​ను తనిఖీ చేశామని తెలిపారు.

స్ర్టాంగ్ రూమ్​ల భద్రతా నిర్వహణ, రికార్డుల వివరాలను ఆయా నియోజకవర్గాలకు చెందిన ఏఆర్వోలు డాక్టర్ కె.నారాయణ, వెంకటేశ్​తో మాట్లాడి నిత్యం నిఘా ఉండాలని వారికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు.