సోలార్​ పవర్​ ప్లాంట్​  కోసం స్థలాన్ని గుర్తించాలి : కలెక్టర్​ సిక్తా పట్నాయక్​

నారాయణపేట, వెలుగు:   జిల్లాలో సోలార్​ పవర్​ ప్లాంట్​ కోసం స్థలాన్ని గుర్తించాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ అధికారులకు సూచించారు.   మహిళా స్వయం సహయక సంఘాల ద్వారా సోలార్​ పవర్​ ప్లాంట్​లను ఏర్పాటు చేయాలని డిప్యూటీ  సీఎం  ఆదేశించినట్టు తెలిపారు.

 మండలంలోని అప్పిరెడ్డిపల్లి శివారులో గల సర్వే నంబర్  17 లోని ప్రభుత్వ భూమిని గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు.   మండలాల్లో  దాదాపు 196 ఎకరాల ప్రభుత్వ స్థలాలలో మహిళ స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ లను  ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు.  కార్యక్రమంలో డీటీ రామకృష్ణ, సర్వేయర్, ఆర్ఐ తదితరులు పాల్గొన్నారు.