
నారాయణపేట, వెలుగు : గ్రామాల్లో బాలిక విద్యపై విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం బేటీ బచావో బేటీ పడావో ప్రచార రథాన్ని కలెక్టర్జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాలో బాల్య వివాహాల నిర్మూలన, లింగ సమానత్వంపై విస్తృత ప్రచారం చేయాలన్నారు.
గ్రామస్థాయిలో కళాకారులతో నాటికలు, చైతన్య గీతాలతో ప్రచారం చేయనున్నట్టు జిల్లా సంక్షేమాధికారి జయ తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకటమ్మ, సూపర్వైజర్ శ్రీలత, డీసీపీవో తిరుపతయ్య, సఖి సెంటర్ అడ్మిన్ క్రాంతిరేఖ తదితరులు ఉన్నారు.