రోడ్డు వెడల్పులో బాధితులకు నష్టం కలిగించొద్దు : కలెక్టర్​ సిక్తా పట్నాయక్

రోడ్డు వెడల్పులో బాధితులకు నష్టం కలిగించొద్దు : కలెక్టర్​ సిక్తా పట్నాయక్

నారాయణపేట, వెలుగు: రోడ్డు వెడల్పు పనులలో  గృహ యజమానులకు నష్టం కలగకుండా చూడాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్  అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్​లో తహసీల్దార్, మున్సిపల్ అధికారులు, బాధితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.4200 స్క్వేర్ యాడ్ ప్రకారం రెసిడెన్షియల్ ప్లాట్స్ కు, రూ. 11,600 కమర్షియల్ షాప్ లకు పరిహారం ఇవ్వడానికి ప్రభుత్వం  నిర్ణయం తీసుకున్నట్టు  తెలిపారు.

ఈ సందర్భంగా188 మందికి గాను165 మంది పరిహారం తీసుకోవడానికి సమ్మతించినట్టు అధికారులు తెలిపారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ బెన్ షాలం, ఆర్డీవో రామచంద్ర, తహసీల్దార్, శ్రీనివాస్, నాగరాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు జిల్లా వ్యవసాయ అధికారుల డైరీని ఆవిష్కరించారు.