లోన్లు ఇచ్చి ఆర్థికవృద్ధికి సహకరించాలి : సిక్తా పట్నాయక్‌‌

హనుమకొండ సిటీ, వెలుగు : అవసరమైన వారికి లోన్లు మంజూరు చేసి వారి ఆర్థికాభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని హనుమకొండ కలెక్టర్‌‌ సిక్తాపట్నాయక్‌‌ ఆదేశించారు. బ్యాంకర్లు, వివిధ శాఖల ఆఫీసర్లతో శుక్రవారం కలెక్టరేట్‌‌లో నిర్వహించిన మీటింగ్‌‌లో ఆమె మాట్లాడారు. కిసాన్‌‌ క్రెడిట్‌‌ కార్డులు మంజూరు చేసేందుకు యానిమల్‌‌ హస్పెండరీ, ఫిషరీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అనంతరం పొటెన్షియల్‌‌ లింక్డ్‌‌ క్రెడిట్‌‌ ప్లాన్‌‌ను ఆవిష్కరించారు.  లీడ్‌‌ బ్యాంక్‌‌ మేనేజర్‌‌ శ్రీనివాస్‌‌, నాబార్డ్‌‌ ఏజీఎంరవి, ఆర్‌‌బీఐ ఆఫీసర్‌‌ రెహమాన్, డీఆర్డీవో నాగ పద్మజ, ఆఫీసర్లు మాధవీలత, రాంరెడ్డి, వెంకటనారాయణ, బద్రునాయక్, దామోదర్‌‌రెడ్డి పాల్గొన్నారు. 

జాతర పనులు స్పీడప్‌‌ చేయాలి

ఆత్మకూరు, వెలుగు : జాతర పనులను స్పీడప్‌‌ చేయాలని హనుమకొండ కలెక్టర్‌‌ సిక్తా పట్నాయక్‌‌ ఆదేశించారు. ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్‌‌లోని సమ్మక్క, సారలమ్మను శుక్రవారం దర్శించుకొని మొక్కులు సమర్పించారు. అనంతరం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

డ్రోన్‌‌, సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేస్తున్నారని పోలీసులను అడిగి తెలుసుకున్నారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించే ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రివ్యూలో పరకాల ఆర్డీవో శ్రీనివాస్, పంచాయతీ రాజ్‌‌ డీఈ లింగారెడ్డి, ఏసీపీ కిశోర్‌‌కుమార్‌‌, తహసీల్దార్‌‌ జగన్‌‌మోహన్‌‌రెడ్డి, సీఐ సంతోశ్‌‌, ఎంపీడీవో శ్రీనివాస్‌‌రెడ్డి పాల్గొన్నారు.