శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్  సిక్తా పట్నాయక్

నర్వ, వెలుగు : దివ్యాంగులు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్  సిక్తా పట్నాయక్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అలింకో సహకారంతో దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన శిబిరాన్ని మక్తల్  ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో మూడు రోజులు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెల రోజుల్లో అలింకో  సంస్థ కాన్పూర్  నుంచి పరికరాలు తెచ్చి పంపిణీ చేస్తారన్నారు.

వర్షాలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం నిధులు మంజూరు చేశారని, క్రాస్ చెక్  చేసుకుని నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ నర్వ మండలం చాలా వెనుకబడి ఉందని వర్షానికి నష్టపోయిన ప్రజలు. రైతులందరిని ఆదుకోవాలని కోరారు. కూలిన ఇండ్లను పరిశీలించి అండగా నిలవాలని సూచించారు. నాగేశ్వర్ గౌడ్, తహసీల్దార్  మల్లారెడ్డి. ఎంపీడీవో శ్రీనివాస్  పాల్గొన్నారు.