కోస్గి వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో గుండుమాల్ మండల కేంద్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, మోడల్ స్కూళ్లలో మధ్యాహ్న భోజన నాణ్యతను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజనం నాణ్యతగా పంపిణీ చేసేందుకు పాఠశాలల్లో ఎండీఎం పిల్లల కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు అందజేయాలని చెప్పారు. పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత పాటించాలన్నారు.
అలాగే పదవ తరగతి ఫలితాల్లో 100శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికను రూపొందించాలన్నారు. వీలైనంత తొందరగా డైనింగ్ హాలు వినియోగంలోకి తీసుకురావాలని, పిల్లలు తిన్న తర్వాత వేస్టేజీ కోసం డస్ట్ బిన్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట గుండుమాల్ ఎంఈఓ ఎం. శేఖర్రెడ్డి, తహసీల్దార్ భాస్కర స్వామి , ఎంపీడీఓ శ్రీధర్ ఉన్నారు.